హైదరాబాద్ బేగంబజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్రవాహనాలు దొంగిలించే వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గాంధీభవన్ పటేల్ నగర్లో పోలీసులు వాహన సోదాలు చేస్తుండగా... దొంగిలించిన బైక్‌తో దొంగ తప్పించుకుని పారిపోయాడు.
దొంగ దొరికాడు: పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.. కానీ తన్నులు తిన్నాడు! - hyderabad crime news
అతడు బైక్ దొంగ.. ఎప్పటిలానే ఓ బైక్ దొంగతనం చేశాడు. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు... కాని స్థానికుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు.
బైక్ దొంగ.. తప్పించుకున్నాడు వేగంగా.. దొరికాడు సుబ్బరంగా
గాంధీభవన్ పటేల్ నగర్ బస్తీ స్థానికులు సదరు బైక్ దొంగని పట్టుకొని దేహశుద్ధి చేసి బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగని స్టేషన్‌కు తరలించారు.