జోగులంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం కుటకనూర్లో రాజారత్నం ఇంట్లో నకిలీ విత్తనాలను పోలీసులు, వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న తరుణంలో కొందరు నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ విత్తనాల విషయంలో ఉపేక్షించేది లేదని వ్యవసాయాధికారులు హెచ్చరించారు.
300 కిలోల నకలీ విత్తనాలు స్వాధీనం - జోగులంబ గద్వాల్ జిల్లా వార్తలు
వర్షకాలం వస్తుండడం వల్ల నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేందుకు కొంత మంది మోసగాళ్లు సిద్ధమయ్యారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ కుటకనుర్లో 300 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు.
నకిలీ విత్తనాలు పట్టుకున్న అధికారులు