తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నేటి నుంచి పీఎల్​జీఏ వారోత్సవాలు.. వెలసిన మావోయిస్టు పోస్టర్లు - విశాఖ మన్యంలో పోలీసులు అలర్ట్ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ పీఎల్​జీఏ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. యువత పెద్ద ఎత్తున పీఎల్​జీఏలో చేరాలని, శత్రువులకు బానిసలు కావద్దని ఆ పోస్టర్లలో ఉంది.

police-alert-on-maoist-party-plga-formation-day-in-visakhapatnam-agency
నేటి నుంచి పీఎల్​జీఏ వారోత్సవాలు.. వెలసిన మావోయిస్టు పోస్టర్లు

By

Published : Dec 2, 2020, 12:33 PM IST

Updated : Dec 2, 2020, 2:14 PM IST

సీపీఐ మావోయిస్టు పార్టీ పీఎల్​జీఏ 20వ ఆవిర్భావ వారోత్సవాలు నేటి నుంచి వారం పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యంలో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. యువత పెద్ద ఎత్తున పీఎల్​జీఏ​లో చేరాలని.. శత్రువుల మాటలు నమ్మి బానిసలు కావద్దని ఆ పోస్టర్లలో ఉంది.

ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులోని పోలీస్ స్టేషన్లలో జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాజకీయ నాయకులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పాడేరు పరిధిలో సంచరించిన మావోయిస్టుల సమాచారంపై ఆరా తీశారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తున్నారేమో అన్న అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డులను సైతం పరిశీలిస్తున్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గిరిజనులతో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న ఊహాగానాలపై.. పోలీసులు దృష్టి పెట్టారు.

ఇవీ చూడండి:ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హైటెన్షన్

Last Updated : Dec 2, 2020, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details