హైదరాబాద్ చైతన్యపురిలోని అలకాపురి కాలనీలో ఓ ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. మృతురాలు యాదగిరిగుట్ట మండలంలోని కందుకూరు గ్రామ సర్పంచ్ కూతురు తేజస్విని. అలకాపురిలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ.. నగర శివారులోని ఓ ఫార్మసీ కళాశాలలో చదువుకుంటుంది. తను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం - hyderabad latest news
హైదరాబాద్ చైతన్యపురిలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన మృతికి ఎవరు కారణం కాదంటూ సూసైట్ నోట్ రాసింది.
ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం