నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కరోనా లాక్డౌన్ వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ రాక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై సంపత్‌కుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. హైదరాబాద్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో గ్రూప్-2 కోచింగ్ తీసుకున్నానని.. ఉద్యోగ నోటిఫికేషన్ రాకకై ఎదురుచూస్తూ మానసిక ఒత్తిడికి లోనై చచ్చిపోతున్నానంటూ.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - man suicide in nalgonda district
ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు.
ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పురుగుల మందు తాగిన అతడిని చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సంపత్‌కుమార్ తండ్రి మిర్యాలగూడ పట్టణంలో టైలర్ పని చేస్తున్నాడు.
ఇవీ చూడండి: అధికారుల నోటీసులు చూసి.. గుండె ఆగి వ్యక్తి మృతి!