ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడులో తమ ఇద్దరు కుమారులు మోక్షజ్ఞ(3), శశిధర్ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. చిన్నారుల నాన్నకు, అతని అన్నయ్యకు ఆస్తి తగాదాలు ఉన్నాయి.
చిన్నారిని చిదిమేసిన ఆస్తి తగాదాలు.. అన్న కుమారుడే హంతకుడు - మార్తాడులో చిన్నారిని చంపిన వ్యక్తి వార్తలు
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల మూలంగా చిన్నాన్న కుమారుడిని చంపేశాడు ఓ వ్యక్తి. ఇద్దరు పిల్లలను చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి అందులో ఒకరిని దారుణంగా హతమార్చాడు. ఇంకొక బాలుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
చిన్నారిని చిదిమేసిన ఆస్తి తగాదాలు.
ఈ క్రమంలో అతని అన్నయ్య కుమారుడు రాము.. చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి బయటకు తీసుకెళ్లాడు. వారిలో మోక్షజ్ఞను చంపేసి ఉరవకొండ మండలం చిన్న ముష్టురు వద్ద ఉన్న హంద్రీనీవా కాలువలో పడేశాడు. రెండో చిన్నారి శశిధర్‌ను ముళ్ల పొదల్లో పడేశాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మోక్షజ్ఞ మృతదేహం కోసం గాలిస్తున్నారు. శశిధర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
ఇవీ చదవండి.. హలో... నేను అనిశా డీఎస్పీని మాట్లాడుతున్నా!