హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలసకూలీ ధర్మారావుగా గుర్తించారు. కాంట్రాక్ట్ వర్క్‌పై ఓ నివాసంలో లిఫ్ట్ పనుల కోసం గోడను కూల్చే క్రమంలో అది అతనిపైనే పడి చనిపోయాడు. పార్శిగుట్టలో నివాసముంటున్న మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
గోడ కూలి వ్యక్తి మృతి - person is killed by a wall collapse
ఓ నివాసంలో లిఫ్ట్ పనుల కోసం గోడను కూల్చే క్రమంలో అది తనపైనే పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
గోడ కూలి వ్యక్తి మృతి