సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం కరస్‌గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మహమ్మద్ జావేద్ అనే వ్యక్తి మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - latest news on Person due to electrocution in sangareddy
ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
తాపీ మేస్త్రీగా పని చేసే జావేద్ అదే మండలంలోని ఇరకపల్లి లష్కర్తండాలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి పైకప్పు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. తీవ్ర గాయాలైన జావేద్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.
TAGGED:
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి