నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడిపూర్కు చెందిన లక్ష్మణ్, శివ, మల్లేష్ ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఆటోని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ బైక్‌ని ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి పరిస్థితి విషమం - person died in raod accdient at thaduru mandal
ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ, మల్లేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వటంతో బాధితులను నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఎవరైనా హత్య చేశారా..?