జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన.. రాళ్లబండి బక్కయ్య, కేదారీశ్వరి దంపతుల కుమారుడు సాయికృష్ణ. ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. దేహదారుఢ్య పరీక్ష ఉన్న రోజునే సోదరి వివాహ ముహూర్తం కుదిరింది. పరీక్ష కోసం వివాహ తేదీని డిసెంబరు 9వ తేదీకి మార్చారు.
కొలువు కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
దేశ రక్షణకు సంబంధించిన కొలువులో చేరాలనే తపన పడ్డాడు. పరీక్ష కోసం అక్క వివాహ ముహూర్తాన్నే మార్పించాడు. ఎంపిక పరీక్షలకు హాజరై.. విధి వంచించి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో అతడి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరంలో తీవ్ర విషాదం అలుముకుంది.
స్నేహితుడితో కలిసి సాయికృష్ణ ఈ నెల 26న విశాఖ చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు ఏపీలోని విశాఖ పైపులైన్ జంక్షన్ వద్ద నేవీ మైదానంలో ఎంపిక పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత 100 మీటర్ల పరుగు పూర్తి చేసి.. వెంటనే పులప్స్ తీస్తుండగా కుప్ప కూలిపోయాడు. నేవీ సిబ్బంది తక్షణమే ఐఎన్‌ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటాక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది.
ఇదీ చూడండి:భర్తను హత్య చేయించిన భార్య.. అందుకు అడ్డొస్తున్నాడనే..