తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గత రాత్రి వర్షానికి ముషీరాబాద్​లో ఓ వ్యక్తి మృతి - hyd rain updates

హైదరాబాద్​లో గత రాత్రి కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. భారీగా కురిసిన వర్షం వల్ల ముషీరాబాద్​లో ఓ వ్యక్తి మృతి చెందాడు. నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో అనేక అపార్ట్మెంట్లు వర్షపు నీటితో నిండాయి.

person dead in musheerabad due to rain
గత రాత్రి వర్షానికి ముషీరాబాద్​లో ఓ వ్యక్తి మృతి

By

Published : Oct 10, 2020, 11:09 AM IST

హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్​లో ఓ వ్యక్తి మృతి చెదాడు. సూపర్ మార్కెట్​కు వెళ్లి వస్తానని చెప్పిన తండ్రి గంటన్నర అవుతున్నా రావట్లేదనే అనుమానంతో అపార్ట్మెంట్ సెల్లార్​లో చూడగా.. విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సాయి ఎన్​క్లేవ్ అపార్ట్​మెంట్ రెండవ అంతస్తు 2002 ఫ్లాట్ నివాసి బీ.రాజ్ కుమార్ హైకోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రితం ఆయన తల్లి మృతి చెందగా.. రాజ్ కుమార్ సెలవులో ఉన్నారు. గత రాత్రి వర్షం తగ్గిన తర్వాత సూపర్ మార్కెట్​కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడు.

గంటన్నర అవుతున్నా తమ తండ్రి రావట్లేదని సూపర్ మార్కెట్​కు, బంధువులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. అసలు మీ తండ్రి రాలేదని వారు చెప్పడంతో అనుమానంతో అపార్ట్మెంట్ సెల్లార్​లో చూడగా.. విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది సెల్లార్ లోని నీటిని తొలగించారు. విగతజీవిగా ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా కేసులు.. 9 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details