హైదరాబాద్లో నూతన గృహాన్ని కొనుగోలు చేసేందుకు తల్లి అంగీకరించక పోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
సెల్ఫీ వీడియో: తల్లి అంగీకరించలేదని ఆత్మహత్య - mahabubabad latest crime news
హైదరాబాద్లో సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను మరువకముందే తాజాగా సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుగులోత్ హనుమ, సత్తెమ్మల కుమారుడు ప్రశాంత్ లాక్డౌన్కు ముందు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించాడు. లాక్డౌన్తో ప్రశాంత్ దంపతులు బయ్యారంలో ఉంటున్న అతని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇక్కడి ఇంటిని అమ్మి హైదరాబాద్లో ఇల్లు కొందాం అనేవాడు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో తరచూ ఇంట్లో ఘర్షణలు జరిగేవి. ఈ రోజు తన గదిలోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుతో బయ్యారం ఎస్ఐ జగదీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్