వనపర్తి జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని మహిళా హాస్టల్లో ఉంటూ ఎస్బీఐ బ్యాంకులో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా రాయినిగూడెంకు చెందిన ఓ యువకునితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వివాహం చేసుకుందామన్నారు. రోజులు గడవగా.. యువకుడు పెళ్లికి నిరాకరించగా అతనిపై బాధితురాలు సూర్యాపేట షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువతి స్నేహితులైన విజయ్, ప్రవీణ్, కావ్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. పెళ్లి పేరుతో వంచించినందుకు యువతికి రూ. 4 లక్షలు చెల్లించాలని ఒప్పందం ఖరారు చేసుకున్నారు.
షీటీం పోలీసులమని చెప్పి మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్
షీటీం పోలీసులమని చెప్పి ప్రేమ వంచనకు గురైన ఓ బాధితురాలి నుంచి రూ. రెండు లక్షలు కాజేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన స్థానిక పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అక్రమ వసూళ్ల వ్యవహారంలో జగిత్యాల జిల్లాకు చెందిన యువతి పాలుపంచుకుంది.
షీటీం పోలీసులమని చెప్పి మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్
ఈ ఒప్పందాన్ని ఆసరా చేసుకున్న యువకులు.. షీటీం పోలీసులు అడిగారని బెదిరించారు. షీటీం పోలీస్‌గా ఓ యువకునితో ఫోన్లో మాట్లాడించారు. భయపడిన బాధిత యువతి.. రూ. 2 లక్షలు ముట్టజెప్పింది. ఆ తర్వాత తనను బెదిరించి వారు షీటీం పోలీసులు కాదని తెలుసుకుని బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారించి.. యువకులను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా