తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గిఫ్ట్​ వోచర్​ పేరుతో మోసం.. రూ. 80 వేలు మాయం - గిఫ్ట్ వోచర్ పేరుతో సైబర్​ మోసం సికింద్రాబాద్​

సికింద్రాబాద్ వెస్ట్ పార్శిగుట్టకు చెందిన బొప్పెన రజనీకి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. పేటీఎం కేవైసీ అప్​డేట్ చేయించుకోవాలన్నాడు. ఆమె బ్యాంక్ ఖాతా, పేటీఎం వివరాలు చెప్పింది. తర్వాత పేటీఎం గిఫ్ట్ వోచర్​కు ఆమెను ఎంపిక చేశారని చెప్పాడు. అనంతరం ఖాతా నుంచి తమ కుటుంబ సభ్యులకు పేటీఎం ద్వారా డబ్బులు పంపించమన్నాడు. అలా చేసిన కొద్ది క్షణాల్లోనే ఆమె ఖాతాలోంచి రూ. 80 వేలు మాయమయ్యాయి.

గిఫ్ట్​ వోచర్​ పేరుతో మోసం.. రూ. 80 వేలు మాయం
గిఫ్ట్​ వోచర్​ పేరుతో మోసం.. రూ. 80 వేలు మాయం

By

Published : Oct 17, 2020, 8:00 PM IST

గిఫ్ట్​ వోచర్ పేరిట ఓ సైబర్ నేరగాడు రూ. 80 వేలు కొట్టేశాడు. సికింద్రాబాద్ వెస్ట్ పార్శిగుట్టకు చెందిన బొప్పెన రజనీకి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. పేటీఎం కేవైసీ అప్​డేట్ చేయించుకోవాలన్నాడు. ఆమె బ్యాంక్ ఖాతా, పేటీఎం వివరాలు చెప్పింది. తర్వాత పేటీఎం గిఫ్ట్ వోచర్​కు ఆమెను ఎంపిక చేశారని చెప్పాడు. అనంతరం ఖాతా నుంచి తమ కుటుంబ సభ్యులకు పేటీఎం ద్వారా డబ్బులు పంపించమన్నాడు. అలా చేసిన కొద్ది క్షణాల్లోనే ఆమె ఖాతాలోంచి రూ. 80 వేలు మాయమయ్యాయి.

ఇదిలా ఉంటే ఉద్యోగం పేరిట మరోవ్యక్తి మోసపోయాడు. దోమల్ గూడ గగన్ మహల్​కు చెందిన గౌతమ్ కుమార్ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు. రెండు రోజుల క్రితం న్యూ దిల్లీలోని మారుతీ సుజుకీ కంపెనీ నుంచి ఉద్యోగం ఇస్తామంటూ ఓ లేఖ వచ్చింది. అందులోని నంబర్​కు ఫోన్ చేయగా శిక్షణ కాలంలో ఇచ్చే వసతులకు రూ. 52,390 పంపించాలని అవతలి వ్యక్తి చెప్పాడు. బాధితుడు ఆ మొత్తాన్ని అంతర్జాలం ద్వారా చెల్లించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఫోన్ స్పిచ్ఛాఫ్ అయింది.

వెంటనే హైదరాబాద్ మారుతీ సుజుకీ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. తమ దగ్గర ఆ పేరున్న వ్యక్తులే లేరని స్పష్టం చేశారు. దీంతో బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:18 మంది ఓఎల్​ఎక్స్​ సైబర్​ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details