తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యక్తి అనుమానాస్పద మృతి.. నాలుగు రోజుల్లోనే చేధించిన పోలీసులు - హత్యకేసు చేధించిన పోలీసులు

భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటన  పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. కాగా.. దర్యాప్తు చేసిన పోలీసులు మృతుడికి సదరు మహిళతో ఎలాంటి సంబంధం  లేదని.. నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

Peddapalli police chase murder case in four days
వ్యక్తి అనుమానాస్పద మృతి.. నాలుగు రోజుల్లోనే చేధించిన పోలీసులు

By

Published : Oct 15, 2020, 1:06 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన తీట్ల శ్రీనివాస్​, పెద్దకల్వల గ్రామానికి చెందిన కారెంగుల శివ, కరీంనగర్​కు చెందిన సాయికిరణ్​ కలిసి.. అక్టోబర్​ 10న ఇరుకుల నర్సయ్య అనే వ్యక్తిని హత్య చేశారు.

తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన తీట్ల శ్రీనివాస్​ తెల్లవారుఝామున ట్రాక్టర్​లో ఇసుక నింపడానికి వెళ్లిన నర్సయ్యను స్నేహితులతో కలిసి హత్య చేశాడని పెద్దపల్లి సీపీ కమలాసన్​ రెడ్డి తెలిపారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను అరెస్టు చేసి.. కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పోలీసు శాఖ తరపున మృతుడి కుటుంబానికి రూ.1లక్షా 14వేలు ఆర్థిక సహాయం చేశారు. కలెక్టర్​ను కలిసి బాధిత కుటుంబానికి మరింత సాయం అందించనున్నట్టు సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details