తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దొంగల ముఠా అరెస్టు.. విలువైన ఆభరణాలు స్వాధీనం!

దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఇద్దరు దొంగలను రామగుండం సీసీఎస్​ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడున్నర లక్షల విలువ చేసే ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో సైతం 30 చోరీలు చేసినట్టు కేసులు ఉన్నట్టు పెద్దపల్లి అదనపు డీసీపీ అశోక్​ కుమార్​ తెలిపారు.

Peddapalli Police Arrest Two Thief's in Mancherial
దొంగల ముఠా అరెస్టు.. విలువైన ఆభరణాలు స్వాధీనం!

By

Published : Sep 24, 2020, 6:09 PM IST

పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. మందమర్రికి చెందిన టెకం రాము, హుస్నాబాద్​కు చెందిన రంజిత్​లు ఈజీమనీకి అలవాటు పడి.. దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు.

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సీసీఎస్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రంజిత్​, రాముని సోదాలు చేశారు. వారి వద్ద భారీ ఎత్తున ఆభరణాలు, నగదు లభించగా.. అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు పెద్దపల్లి అదనపు డీసీపీ అశోక్​ కుమార్​ తెలిపారు. వీరిద్దరూ గతంలో కూడా దొంగతనం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

ఇదీ చదవండి:దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details