పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పట్టణానికి చెందిన సతీశ్, భూపతి, ప్రభాకర్... అమర్ నగర్లోని ఛాయ్ హోటల్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న యువకులు అరెస్ట్ - పెద్దపల్లి తాజా వార్తలు
ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న ముగ్గురు యువకులను పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులకు యువకుల నుంచి ఆరు చరవాణిలు, నగదు దొరికింది. నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న యువకులు అరెస్ట్
ముగ్గురు యువకుల వద్ద 6 చరవాణిలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో నిషేధించబడిన ఆన్లైన్ రమ్మీ గేమ్ ఎవరైనా ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజేశ్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం