పెద్దపల్లి అంతర్గాం మండలం గోలివాడ మెగా క్యాంప్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన రాజు వీరేందర్ కుమార్, ధర్మేందర్ కుమార్ అనే నిందితులని పోలీసులు పట్టుకున్నారు. వారిరువురు మరో స్నేహితురాలితో కలిసి పథకం ప్రకారం క్యాంపు కార్యాలయంలోని బీరువా నుంచి రూ. 20 లక్షలు చోరీచేసి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయారని డీసీపీ రవీందర్ యాదవ్ తెలిపారు.
దీనిపై కంపెనీలో ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అంతర్గాం పోలీసులు తెలిపారు. రామగుండం సీఐ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో క్రైం పార్టీలు ఏర్పాటు చేసి రెండు బృందాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగిందన్నారు. ఆఖరికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్ చెందిన వారని తెలిసిందన్నారు. అక్కడికి వెళ్లి విచారణ జరపగా వారు చోరీచేసినట్టు ఒప్పుకున్నారన్నారు.