అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భాజపా నేతలు పట్టుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ బాగ్అంబర్పేట్ పోచమ్మ బస్తీ పరిసరాల నుంచి కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న భాజపా నాయకులు రంగంపల్లి రాజు , ఏడెల్లి అజయ్ కుమార్, చుక్క జగన్, కించే చంద్రశేఖర్, తదితరులు రాత్రి పోచమ్మ బస్తీ నుంచి ఆటోలో తరలిస్తుండగా... రేషన్ బియ్యాన్ని పట్టుకొని అంబర్పేట పోలీసులకు అప్పగించారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న భాజపా నేతలు - ration biyyam pattivetha
హైదరాబాద్ బాగ్అంబర్పేట్ పోచమ్మబస్తీ నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భాజపా నేతలు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని పోలీసులకు అప్పగించారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న భాజపా నేతలు