తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు - తెలంగాణ వార్తలు

సోన్ మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి తహసీల్దార్​కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

pds rice seized at soan mandal in nirmal district
రేషన్ బియ్యం పట్టివేత... ఇద్దరిపై కేసు నమోదు

By

Published : Dec 18, 2020, 4:43 PM IST

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సోన్ ఎస్సై ఆసిఫ్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఓ ఆటో అనుమానంగా కనిపించడంతో సోదాలు చేసి... 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

ఓ మోటార్ సైకిల్​పై ఒక క్వింటా బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ రియాజ్, షేక్ ముస్తాక్ బేగ్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి.. తహసీల్దార్​కు అప్పగించినట్లు ఎస్సై వివరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:బంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపే దోచేశారు!

ABOUT THE AUTHOR

...view details