వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను వీరు తరచూ ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు.
ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలపై పీడీ యాక్ట్ - ముగ్గురు అంతరాష్ట్ర దొంగలపై పీడీ యాక్ట్
రామగుండం, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. పంజాబ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
ముగ్గురు అంతరాష్ట్ర దొంగలపై పీడీ యాక్ట్
పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురు లాల్సింగ్, జస్పాల్ సింగ్, చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన నరేంద్ర సింగ్లపై బెల్లంపల్లి గ్రామీణ సీఐ జగదీష్... పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకు వీరు 12 దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులను రామగుండం సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.