తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ - రంగారెడ్డి జిల్లా క్రైం దొంగ అరెస్ట్ వార్తలు

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న సబావత్ పాండు అనే దొంగని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై 2001 నుంచి ఇప్పటి వరకు అనేక కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

PD Act on a person who frequently commits theft
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి పై పోలీసులు పీడీ యాక్ట్

By

Published : Dec 26, 2020, 5:34 PM IST

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న సబావత్ పాండు అనే దొంగను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్ సింగ్ తెలిపారు. వారిలో నిందితుడి భార్య కూడా ఉండడం గమనార్హం. నిందితుడి వద్ద నుంచి 23 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 30వేల నగదు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 12 లక్షల 45 వేల ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

పీడీ యాక్ట్ నమోదు..

నిందితుడిపై యాచారం, కందుకూరు, కంచాన్​బాగ్ పోలీస్ స్టేషన్​లలో పలు కేసు నమోదు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రాకపోవటంతో.. పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా కాలంలోనూ అదరగొట్టిన రైల్వే!

ABOUT THE AUTHOR

...view details