హత్య కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ అజార్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్‌ని నమోదు చేశారు. పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే అజార్ గుడిమల్కాపూర్ మార్కెట్లో హమాలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో పలు చోరీలు చేసిన అజార్... తమ రికార్డుల్లో నేరస్థుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం చంచల్‌గూడలో..
తాజాగా హత్య కేసులోనూ అజార్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. బహదూర్‌పూర, కాలాపత్తర్ ఠాణాల్లో నిందితుడిపై పలు కేసులు ఉన్నాయన్నారు. నేరనియంత్రణలో భాగంగానే నిందితుడిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అజార్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు