తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పేటీఎం కోసం కేవైసీ అప్​డేట్​ అంటారు.. లక్షలు దోచేస్తారు.. - సైబర్​ నేరగాళ్లు అరెస్టు హైదరాబాద్

పేటీఎం కోసం కేవైసీ అప్​డేట్​ అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సపీ సజ్జనార్‌ తెలిపారు. యాప్‌ డౌన్‌లోడ్‌ పేరుతో డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి ఒక రూపాయి డిపాజిట్ చేయాలని కోరుతారని.. ఆ తర్వాత రిమోట్ యాక్సెస్​తో లక్షల రూపాయలు కొట్టేస్తారని ఆయన వివరించారు. నిందితుల నుంచి రూ. లక్షా 47 వేల నగదు, చరవాణీలు, డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

పేటీయం కోసం కేవైసీ అప్​డేట్​ అంటారు.. లక్షలు దోచేస్తారు..
పేటీఎం కోసం కేవైసీ అప్​డేట్​ అంటారు.. లక్షలు దోచేస్తారు..

By

Published : Oct 13, 2020, 5:06 PM IST

పేటీఎం కోసం కేవైసీ అప్​డేట్​ అంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. లక్షా 47 వేల నగదు, చరవాణీలు, డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులంతా సైబర్ నేరాలు చేయడంలో ఆరితేరారని పేర్కొన్నారు. ఈ తరహా మోసాలు ఝార్ఖండ్​ రాష్ట్రం జంతార జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

యాప్‌ డౌన్‌లోడ్‌ పేరుతో డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి ఒక రూపాయి డిపాజిట్ చేయాలని కోరుతారని.. ఆ తర్వాత రిమోట్ యాక్సెస్​తో లక్షల రూపాయలు కొట్టేస్తారని సీపీ సజ్జనారు వివరించారు. వినయ్‌శర్మ అనే బాధితుడి నుంచి రూ. 4 లక్షల 29 వేలు కొట్టేశారన్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.

ఈ కేసులో ఝార్ఖండ్‌కు చెందిన నంకు మండల్‌ అలియాస్ రాహుల్, రాజేశ్​ మండల్‌, శివశక్తి కుమార్ అలియాస్ అమిత్ , గౌరవ్ అరుణ్‌, దిల్‌ఖుష్‌ కుమార్ సింగ్‌లను అరెస్టు చేశామని సజ్జనార్​ వెల్లడించారు.

ఇదీ చదవండి:సైబర్ భద్రత కోసం 'ఫైవ్​ ఐస్'​తో భారత్ పొత్తు

ABOUT THE AUTHOR

...view details