ఇంట్లో పూజలు చేస్తున్న తనపై పక్కింట్లో ఉంటున్న పాస్టర్ కర్రతో దాడి చేశాడని... ఓ మహిళ సైబరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ దాడిలో తలకు తీవ్ర గాయమై... 12 కుట్లు పడినట్లు బాధితురాలు తెలిపింది.
పూజలు చేస్తున్న మహిళపై పక్కింట్లో ఉంటున్న పాస్టర్ దాడి - hyderabad news
పూజలు చేయవద్దంటూ పాస్టర్ తనపై దాడిచేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు పాస్టర్, ఆయన సిబ్బంది నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకుంది.
paster attack on neighbor women in rajendranagar
నాలుగేళ్లుగా... తనను పూజలు చేయవద్దని పాస్టర్ బెదిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. పూజలు చేస్తే చంపేస్తామని చాలా సార్లు బెదిరించాడని పోలీసుల ముందు వాపోయింది. పూజ చేస్తున్న సమయంలో వెనకాల నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చి తనపై కర్రలతో దాడి చేశారని... వారితో నాకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.