నకిలీ ఆరోగ్యసేతు యాప్ పేరుతో లింక్‌లు పంపిస్తూ పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరో కొత్తరకం చౌర్యానికి పాల్పడుతున్నారు. రక్షణ, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సమాచారం చౌర్యం చేసేందుకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి.
ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొబైల్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే... చాట్ మీ అనే యాప్ డౌన్ లోడ్ అవుతుందని దీని ద్వారా ఫోన్‌లో ఉన్న సమాచారమంతా వారి సర్వర్‌లలో నిక్షిప్తమవుతుందని నిఘా వర్గాలు తెలిపాయి.