ఆర్టీసీ బస్సు ఢీకొని పొరుగుసేవల ఉద్యోగి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నగర్‌లోని మార్కెట్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీకాంత్.. ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది.
ఆర్టీసీ బస్సు ఢీకొని.. పొరుగు సేవల ఉద్యోగి మృతి - ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విక్టోరియా మెమోరియల్ మెట్రోస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని పొరుగుసేవల ఉద్యోగి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదం, విక్టోరియా మెమోరియల్ మెట్రోస్టేషన్, ఆర్టీసీ బస్సు, చైతన్యపురి
ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. వ్యక్తి మృతి