తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కీసర మాజీ తహసీల్దార్​ బినామీకి చెందిన లాకర్​ సీజ్​కు ఆదేశాలు

మేడ్చల్​ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు అనిశా అధికారులు. ఆల్వాల్​ ఐసీఐసీఐ శాఖలో ఉన్న లాకర్​ సీజ్​ చేయాలని సదరు బ్యాంకు అధికారులకు ఆదేశించారు.

keesara case
కీసర మాజీ తహసీల్దార్​ బినామీకి చెందిన లాకర్​ సీజ్​కు ఆదేశాలు

By

Published : Oct 20, 2020, 5:40 AM IST

మేడ్చల్​ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాగరాజు బినామీల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఆల్వాల్​లోని మహేందర్​ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. మహేందర్, ఆయన సోదరుడు నందగోపాల్​కు సంయుక్తంగా ఐసీఐసీఐ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. లాకర్ వీరి పేరుమీద ఉన్నా... నాగరాజు భార్య స్వప్న దాన్ని నిర్వహిస్తున్నట్లు మహేంద్ర తెలిపారు. అల్వాల్ ఐసీఐసీఐ శాఖలో ఉన్న లాకర్​ను సీజ్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సదరు బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేశారు. లాకర్ తెరిస్తే అందులో ఏమైనా బయటపడొచ్చని అధికారులు భావిస్తున్నారు.

కీసర మండలం రాంపల్లి దాయరలో నకిలీ పాస్​పుస్తకాలు జారీ చేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు ఈనెల 16వ జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాసుపుస్తకం కేసులో మూడు రోజుల కస్టడీలో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు 15వ తేదీ కస్టడీలోకి తీసుకుని నాగరాజును తమ కార్యాలయంలో ప్రశ్నించారు. సమయం ముగిసిన తర్వాత 15వ తేదీ సాయంత్రం చంచల్ గూడ జైల్లో వదిలి పెట్టి వచ్చారు. 16వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

రాంపల్లి దాయరలోనే వివాదాస్పద భూమి స్థిరాస్తి వ్యాపారికి కట్టబెట్టేందుకు నాగరాజు కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆగస్టు 14వ తేదీన అరెస్ట్​ చేశారు. ఈ రెండు కేసుల్లో అనిశా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవీచూడండి:ఒక్కొక్కరుగా బయటకొస్తున్న కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజు బినామీలు

ABOUT THE AUTHOR

...view details