తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్​ - ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్​

ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న నేరగాళ్ల ముఠాకు చెందిన ఓ వ్యక్తిని మల్కాజిగిరి ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి పశ్చిమ బంగాల్​కు చెందిన ఇద్దరు యువతులను కాపాడారు.

Online prostitution gang conspiracy .. One arrested
ఆన్‌లైన్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్​

By

Published : Jul 22, 2020, 9:09 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శివ, కరీంనగర్​కు చెందిన చిన్నా అనే ఇద్దరు కలిసి ముంబై, పశ్చిమ బంగాల్‌ తదితర ప్రాంతాల నుంచి ఒప్పందం ప్రకారం యువతులను తీసుకొచ్చి.. వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇందుకోసం దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. సదరు యువతుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నట్లు విచారణలో బయట పడిందని వివరించారు.

ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. పరారీలో ఉన్న చిన్నా కోసం గాలిస్తున్నారు.

ఇదీచూడండి: విద్యార్థిని అదృశ్యం... ఆందోళనలో యువతి కుటుంబం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details