తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మాటలతో ఉబ్బిస్తూ.. ఖాతాల్లో ఊడ్చేస్తూ..! - online loan applications targeting youth

నమ్మబలికే మాటలతో.. యువత అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఆన్​లైన్ కాల్ మనీ యాప్​లు. అప్పటికప్పుడే తమకు డబ్బు అవసరమున్న యువత ఆ యాప్​ చట్రంలో పడి సరైన సమయంలో నగదు చెల్లించలేక నిర్వాహకుల ఉచ్చులో పడుతున్నారు. వారి నుంచి తప్పించుకునే మార్గం లేకుండా మరో 25 యాప్‌లను పరిచయం చేసి రుణం తీసుకొనేలా చేస్తున్నారు.

online loan applications forcing youth to repay debt
ఆన్​లైన్​ కాల్​మనీతో యువతకు ఉచ్చు

By

Published : Dec 21, 2020, 1:24 PM IST

ఆన్‌లైన్‌ ‘కాల్‌మనీ’పై పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిర్ణీత వ్యవధిలో రుణం చెల్లించినా.. ‘యాప్‌’ల చట్రం నుంచి బయటికెళ్లకుండా ఉచ్చు బిగిస్తున్నారు. మరో 25 యాప్‌లను పరిచయం చేసి రుణం తీసుకొనేలా చేస్తున్నారు.

సింగరేణికి కాలనీకి చెందిన ఓ బాధితుడు నవంబరులో ‘మై బ్యాంక్‌’ యాప్‌ నుంచి రూ.3,500 తీసుకుని వారంలోపు చెల్లించాడు. ఆ వెంటనే ‘మరికొన్ని యాప్స్‌ను అన్‌లాక్‌ చేశాం..డౌన్‌లోడ్‌ చేసుకుని మరింత రుణం తీసుకోవచ్చు’ అంటూ సందేశం పంపారు. రూ.30వేలు తీసుకున్నాడు. వారంలో రూ.55 వేలు కట్టాలని సందేశం రావడంతో లబోదిబోమన్నాడు.

వెయ్యికి పైగా..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో రుణమిచ్చే యాప్‌ల సంఖ్య వెయ్యికి పైగానే ఉందని రాచకొండ, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. వీటిలో చైనా యాప్‌లే ఎక్కువ. విదేశీ నిర్వాహకులు భారత్‌లోని ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్స్‌)తో ఒప్పందం చేసుకుని రుణాలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో మారుపేర్లతో కార్యాలయాలను తెరిచారు. ఇటీవల రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు 50 ఫిర్యాదులందాయి. అన్ని యాప్‌లలో అధిక శాతం రూ.8 వేల వరకే రుణాలిస్తున్నట్లు తేలింది. ఒకదాంట్లో తీసుకున్న రుణాన్ని చెల్లించాకే మరో యాప్‌లో తీసుకుంటున్నారు. 20-25 యాప్‌లలో తీసుకోవడం ద్వారా రుణం రూ.లక్షల్లోకి చేరుతోంది.

ఆరు రెట్లు ఎక్కువ కట్టాలని..

ఇటీవల రాచకొండ సైబర్‌క్రైం విభాగాన్ని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆశ్రయించాడు. 24 యాప్‌లలో రూ.3లక్షల రుణం తీసుకున్నానని, ఇప్పటికే రూ.8 లక్షలు కట్టానన్నాడు. ఇంకా రూ.11లక్షలు కట్టాలని బెదిరిస్తున్నట్లు వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details