ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వహకులు తనను వేధిస్తున్నారంటూ ఓ యువకుడు మహబూబ్‌నగర్ జిల్లా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మొహినొద్దీన్ తన అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ యాప్ ద్వారా 4వేలు, క్రెడిట్ యాప్ ద్వారా 5వేల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించాడు. అనంతరం మరో 35 యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వాటి ద్వారా 8లక్షల 97వేల 506 రుపాయల అప్పు చేశాడు. వడ్డీతో కలిపి మెుత్తం 9లక్షల 33వేల 455 రుపాయలను తిరిగి తీర్చాడు. అయినప్పటికీ ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించమని యాప్ నిర్వహకులు వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయా సంస్థలపై చీటింగ్, తెలంగాణ మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు.
'ఆన్‌లైన్ రుణ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు' - మహబూబ్‌నగర్ నేర వార్తలు
ఆన్‌లైన్ యాప్స్ ద్వారా రుణం పొందిన వ్యక్తులు వాటిని తిరిగి చెల్లించే క్రమంలో వేధింపులకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగ మొబైల్ యాప్ నిర్వహకులు తనను వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది.
'ఆన్‌లైన్ రుణ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు'