హలో మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. సీనియర్ హైవే ఇంజనీర్ ఉద్యోగానికి అర్హులు. ఆకర్షణీయమైన జీతం ఇస్తామంటూ ఫోన్ చేసి అమాయకులకు ఉద్యోగాలు ఎర వేస్తున్న సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన సుధీర్ అనే వ్యక్తి జాబ్ సైట్లో బయోడేటాను పొందుపరిచాడు. మీకు సీనియర్ హైవే ఇంజినీర్‌గా ఉద్యోగానికి అర్హులని ఫోన్ వచ్చింది. మీ పేరు రిజిస్ట్రేషన్ కోసం నగదు జమ చేయాలంటూ విడతల వారీగా రెండున్నర లక్షల రూపాయలు దోచేశారు.
ఉద్యోగం రాకపోవటం వల్ల బాధితుడికి అనుమానం వచ్చి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితుడు డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతాలు దిల్లీ జామ్ తారాకు చెందినవిగా గుర్తించారు. నిందితుని ఖాతాలో ఉన్న 73 వేల నగదును సీజ్ చేసి బాధితునికి డీడీ రూపంలో అందించారు.