తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వైద్యం చేయించుకోలేని వారికి వచ్చే సాయాన్ని సైతం దోచుకుంటున్నారు

ఫేస్​బుక్​లో పోస్టులు పెడతారు. వైద్యం చేయించుకునే స్థోమత లేదని వివరిస్తారు. పాపం వీరికి మీరే సాయం చేసి ఆదుకోవాలంటారు. ఆ పోస్టుల్లో ఉన్న బాధితులకు దాతల నుంచి సాయం అందగానే... కొంచెం కూడా ఆలోచించకుండా మొత్తం దోచుకుని వారిని గాలికి వదిలేస్తారు. ఇలాంటి ఇద్దరు నిందితులను హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

online-cheaters-arrested-in-hyderabad
వైద్యం చేయించుకోలేని వారికి వచ్చే సాయాన్ని సైతం దోచుకుంటున్నారు

By

Published : Jul 29, 2020, 9:07 PM IST

అనారోగ్య వ్యాధులతో బాధపడుతున్న వారిని సామాజిక మాధ్యమాల్లో చూపిస్తూ... వారి పేరు మీద వచ్చిన డబ్బు దోచుకుంటున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్​ చంద్రయాన్​గుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

హుమాయున్ నగర్​కు చెందిన సల్మాన్​ఖాన్, హైదరాబాద్ యూత్ కౌరేజ్ ఎన్డీవో అధ్యక్షుడు సయ్యద్ ఆయూబ్ ఇద్దరు కలిసి పేద వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను చిత్రీకరిస్తారు. సామాజిక మద్యమాల్లో ప్రదర్శించి దాతల సాయం అడుగుతారు. ఎవరైన దాతలు స్పందించి సాయం చేయగా... ఆ డబ్బులను బాధితులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

పాతబస్తీలోని నర్కిఫుల్​బాగ్ ప్రాంతంలోని యాస్మిన్ సుల్తానా అనే మెదడు వ్యాధిగ్రస్తురాలి ఇంటికి వెళ్లిన నిందితులు.. ఆమె పరిస్థితిని ఫేస్​బుక్ పేజీలో షేర్​చేశారు. బ్యాంక్ అకౌంట్ నంబర్లు ప్రదర్శిస్తూ దాతల సాయం కోసం ప్రకటన చేశారు. రోగిని చూసి చలించిపోయిన పలువురు దాతలు డబ్బును బాధితుల అకౌంట్​లో వేశారు. అందులోని ఓ దాతకు అనుమానం వచ్చి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు దర్యాప్తు చేయగా... బాధితుల ఖాతా​లో వేసిన డబ్బును సల్మాన్​ఖాన్, ఆయూబ్ తమ అకౌంట్​లోకి మళ్లించుకున్నట్లు తేలింది. ఇలా దాదాపు రూ.30 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ యూత్ కౌరేజ్ ఎన్జీవో ప్రెసిడెంట్ సల్మాన్​ఖాన్, అతని అనుచరుడు ఆయూబ్​ను పోలీసులు అరెస్ట్ చేయగా... అస్రాబేగం, రషీద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details