సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నలుగురు యువకులు చేతబడి నేర్చుకుంటూ.. సంచలనం సృష్టించారు. గోవిందాపురంలో స్థానికంగా ఉండే నలుగురు యువకులు... అర్ధరాత్రి స్మశాన వాటికలో చేతబడి చేస్తున్నారు. అదే సమయంలో అటు వైపునకు వెళ్లే మనుషులకు స్మశాన వాటిక నుంచి ఏవో మనుషుల అరుపులు వినిపించాయి. అనుమానం వచ్చి అటువైపు వెళ్లగా నలుగురు యువకులు అక్కడ కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ కనిపించారు.
వెంటనే సదరు వ్యక్తి భయాందోళనకు లోనై... స్థానికులకు ఫోన్లో సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు చేతబడి చేస్తున్న యువకులను పట్టుకొని నిలదీశారు. ఇంట్లో సమస్యలు తొలిగి పోవటానికి ఇలా చేస్తున్నామని చెప్పారు... కానీ వీళ్లు చెప్పిన విషయాలు నమ్మదగిన విధంగా అనిపించక పెద్ద మనుషులతో కలిసి చేతబడి చేసిన ప్రదేశానికి వెళ్లగా విస్తుబోయే విషయాలు బయట పడ్డాయి.