తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆన్​లైన్​ యూప్​లో రుణం తీసుకుంటే అంతే సంగతులు - హైదరాబాద్​ నేర వార్తలు

మీకు డబ్బు కావాలా.. ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఇస్తాం.. తక్కువ వడ్డికే రుణం.. ఇలా ఆన్​లైన్​ యాప్​లు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇలా యాప్​ల్లో రుణాలు తీసుకుని.. వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. తాజా సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు చెందిన పవన్​ కుమార్​ ఆన్​లైన్​ యాప్​ ద్వారా రుణం తీసుకుని వేధింపులకు గురయ్యారు.

online apps loan harassment at patancheru in sangareddy district
ఆన్​లైన్​ యూప్​లో రుణం తీసుకుంటే అంతే సంగతులు

By

Published : Dec 18, 2020, 4:41 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడికి డబ్బు అవసరం వచ్చింది. అతని స్నేహితుడిని పైసలు అడగ్గా ఆన్​లైన్​ యాప్​ ద్వారా రుణం తీసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన పవన్​ 10 యాప్​ల ద్వారా రూ. 70 వేల వరకు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత ఎంత చెల్లించినా మళ్లీ మళ్లీ చెల్లించాలంటూ కొంతమంది ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేశారు.

అదే సమయంలో ఇతని ఫోన్లో సమాచారాన్ని ఫోన్ నెంబర్లను రుణం ఇచ్చే సమయంలో తీసుకుని వారికి ఫోన్ చేసి రుణం ఎగవేతదారులుగా ప్రచారం చేస్తున్నారు. అమ్మాయిల బ్రోకర్ అని రకరకాలుగా వేధింపులకు గురి చేశారు చివరకు పవన్​ తండ్రి నారాయణ రావుకు ఫోన్​ చేశారు. కొడుకు పరిస్థితి చూసిన ఆయన కొంత నగదు చెల్లించారు. ఇలా తండ్రీకొడుకులు రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు చెల్లించారు. అయినా వేధింపులు ఆగకపోవటంతో శుక్రవారం పటాన్​చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆన్​లైన్​ యూప్​లో రుణం తీసుకుంటే అంతే సంగతులు

ఇదీ చదవండి:పెద్దలు పెళ్లికి నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details