తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అదుపు తప్పిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - కుమురం భీం జిల్లా వార్తలు

ఓ ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడిపోవడంతో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన కుమురం భీం జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

one youngster is dead in accident in kumuram bheem district
అదుపు తప్పిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

By

Published : Jan 2, 2021, 4:57 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బ్రేక్​ వేయడంతో ఓ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సురేష్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వంకులం గ్రామానికి చెందిన వగాడే సురేష్, చౌదరి మహేష్ లు ఇద్దరు జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కాగజ్​నగర్ నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనానికి ఎదో అడ్డువచ్చింది. అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. సురేష్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడ్డ మహేష్​ను స్థానికులు ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :ప్రగతిభవన్ ముట్టడికి గురుకులాల పీఈటీ అభ్యర్థుల యత్నం

ABOUT THE AUTHOR

...view details