తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కోపన్​గిడి జలపాతంలో జారిపడి యువకుడి మృతి

ప్రకృతి అందాన్ని చూసేందుకు వెళ్లిన ఆ యువకున్ని జలపాతం బలితీసుకుంది. ఆదిలాబాద్​ జిల్లా మొలాల్​గుట్ట అటవీ ప్రాంతంలోని కోపన్​గిడి జలపాతంలో జారిపడిన యువకుడు మృతి చెందాడు. గతఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు.

By

Published : Aug 4, 2020, 7:24 PM IST

one young man died in kopangudi jalapatham
one young man died in kopangudi jalapatham

ఆదిలాబాద్‌ జిల్లా మొలాల్‌గుట్ట అటవీ ప్రాంతంలోని కోపన్‌గిడి జలపాతంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఇంద్రవెల్లికి చెందిన యువకుడు డాక్మె సచిన్‌ తన మిత్రుడితో కలిసి నిన్న సాయంత్రం కోపన్‌గిడికి జలపాతాన్ని చూడడానికి వెళ్లాడు. పైనుంచి జాలువారుతున్న నీటిధార దగ్గరికి వెళ్లి చూస్తుండగా... మడుగులోకి జారీ పడిన ఘటన అక్కడే ఉన్న మరికొంతమంది తీస్తున్న చరవాణిలో నిక్షిప్తమైంది.

సచిన్‌ జారిపడిన మడుగు చాలా లోతైనది కావటం వల్ల ఎవరూ కాపాడలేకపోయారు. అది దట్టమైన అటవీప్రాంతం కావటం వల్ల ఈరోజు ఆదిలాబాద్‌ గ్రామీణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో మడుగును వెతికించగా... సచిన్‌ మృతదేహం లభ్యమైంది. శవపంచనామా చేసి మృతదేహాన్ని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details