తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నీటి తొట్టెలో పడి ఏడాది పాప మృతి... - badradri news

నీటి టబ్బులో పడి ఏడాది పాప మృతి చెందిన విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాప... విగతజీవిగా నీటిటబ్బులో తేలటాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.

one year baby died due to drown in water tub
one year baby died due to drown in water tub

By

Published : Sep 5, 2020, 8:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడకం శ్రీను, సమ్మక్క దంపతులకు ఏడాది వయసున్న పాప ఉంది. చిన్నారి ఆడుకుంటూ ఇంటి వెనకకు వెళ్లింది. అక్కడే ఉన్న నీటి టబ్బుతో ఆడుతుండగా... ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల పాపకు ఊపిరాడక అందులోనే మరణించింది.

చాలాసేపటి వరకు పాప కనిపించటపోయే సరికి తల్లిదండ్రులు అంతా వెతికారు. ఇంటి వెనకకు వెళ్లి చూడగా... నీటి టబ్బులో విగతజీవిగా పాప కనిపించింది. అప్పటివరకు కళ్లముందు ఆడుకున్న పాప... విగతజీవిగా కన్పించటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details