యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాల్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండకు చెందిన కిరణ్ కుమార్, సుష్మ దంపతులు తమ పాపను తీసుకొని తమ స్వగ్రామానికి బయలుదేరారు. సుష్మ తన మొహం చుట్టూ చుట్టుకున్న స్కార్ఫ్ గాలికి ఎగిరి బైకు టైరులోకి చొచ్చుకుపోయింది.
స్కార్పే యమపాశమై మహిళను బలితీసుకుంది - యాదాద్రి భువనగిరి జిల్లా తాల్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం
రెండేళ్ల క్రితమే వారికి వివాహమైంది. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. పండుగ రోజు అత్తింటికి వెళ్తుండగా... రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె కట్టుకున్న స్కార్ఫే ఆమె చావుకు కారణమైంది. ఆ చిన్నారికి తల్లిని లేకుండా చేసింది.
ఆమె కట్టుకున్న స్కార్ఫే... రోడ్డు ప్రమాదానికి కారణం
ఒక్కసారిగా ద్విచక్రవాహనం అదుపుతప్పి వారంతా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సుష్మ, చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వారి సాయంతో కిరణ్ కుమార్ భార్య, కూతురుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. సుష్మ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..