తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇంటి నిర్మాణ విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

ఇంటి నిర్మాణ విషయంలో తలెత్తిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఇంటి నిర్మాణం తన స్థలంలోకి వస్తుందని అడిగినందుకు సొంత అన్న, అతని కుమారుడు కలిసి దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

One person was killed in a dispute over the construction of a house in suryapet
ఇంటి నిర్మాణ విషయంలో అన్నదమ్ముల ఘర్షణ.. తమ్ముడు మృతి

By

Published : Sep 29, 2020, 11:48 AM IST

సూర్యాపేట జిల్లా నూతన్​కల్ మండలం టీక్యా తండాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మరణించారు.

లావుడ్య చంద్రియ, లావుడ్య నంద అన్నదమ్ములు. అన్న చంద్రియ నూతనంగా ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటిపై కప్పు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇంటి నిర్మాణం తన స్థలంలోకి వస్తోందని నంద అన్న చంద్రియతో గొడవకు దిగాడు.

ఈ క్రమంలో చంద్రియ, అతని కుమారుడు సోమాలీ.. నందపై దాడి చేశారు. ఘటనలో నంద అపస్మారక స్థితికి చేరుకోగా.. చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.

ఈ విషయంపై మృతుడు నంద భార్య బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఇదీచూడండి: నయీం ప్రధాన అనుచరుడు అరెస్ట్​.. రిమాండ్​కు తరలింపు

ABOUT THE AUTHOR

...view details