తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో పశువుల కాపరి మృతి - సంగారెడ్డిలోని పటాన్​చెరు వద్ద గేదెల కాపరి మృతి

ఎప్పటిలాగే గేదెలను మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

one person suspect death at patancheru in sangareddy district
అనుమానాస్పద స్థితిలో గేదెల కాపరి మృతి

By

Published : Aug 5, 2020, 1:37 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన అనంతయ్య (35) ముత్తంగి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి వద్ద గేదెల కాపరిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే గేదెలను మేపడానికి వెళ్లిన అతను గ్రామ శివారులోని ఔటర్ రింగురోడ్డు కూడలికి సమీపంలో ఓ చెట్టు కింద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు.

మృతుడు రుమాలును మధ్యకు చీల్చి చెట్టుకి ఉరివేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్​చెరు డీఎస్పీ రాజేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ABOUT THE AUTHOR

...view details