తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమవివాహం చేసుకున్నాడు.. కుటుంబకలహాలతో శవమయ్యాడు - sangareddy district latest news

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది సత్యపుత్​ జన అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

one person suicide at muthangi in sangareddy district
ప్రేమవివాహం చేసుకున్నాడు.. కుటుంబకలహాలతో శవమయ్యాడు

By

Published : Sep 27, 2020, 9:46 PM IST

ఒడిశా రాష్ట్రానికి చెందిన సత్యపుత్ జన 2 నెలల క్రితం ఫేస్​బుక్ ద్వారా పరిచయమైన సరస్వతిదాస్​ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ హోటల్​లో పని చేస్తున్నాడు.

ప్రస్తుతం వారు ఉంటున్న గది ఇరుకుగా ఉండటంతో వేరే గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు భార్యను కొత్త గది తాళాలు అడిగాడు. భార్య సరస్వతి ఒప్పుకోకపోవటం వల్ల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సత్యపుత్​ కొత్తింటి తాళాలు తీసుకుని వెళ్లి.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాడు.

అనంతరం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. సరస్వతి తాను ఒడిశా వెళ్లిపోతానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. మనస్తాపం చెందిన సత్యపుత్ జన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన సరస్వతి స్థానికుల సహాయంతో సత్యపుత్​ను ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చందానగర్​లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ సత్యపుత్​ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ

ABOUT THE AUTHOR

...view details