ఇద్దరు కూలీల మధ్య గొడవ హత్యకు దారితీసింది. మద్యం మత్తులో తోటి కూలీని బండరాయితో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మోకన్‌పల్లిలో ఓ వ్యక్తి హత్య గురయ్యాడు.
మద్యం మత్తులో తోటి కూలీని హతమార్చిన వ్యక్తి - నిజామాబాద్ జిల్లాలో హత్య
మద్యం మత్తు తోటి కూలిని హత్య చేసేందుకు కారణమైంది. ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరకు ప్రాణాలను తీసింది. తాగిన మైకంలో తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లాలో నవీపేట్ మండలం మోకన్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.
మద్యం మత్తులో తోటి కూలీని హతమార్చిన వ్యక్తి
బీహార్‌కు చెందిన కొంతమంది కూలీలు మోకన్‌పల్లిలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో కుక్కకు భోజనం పేట్టే విషయంలో ఇద్దరు కూలీల మధ్య తగాదా తలెత్తింది. తాగిన మైకంలో అభిమన్యు అనే వ్యక్తి తోటి కూలీ తేజ్‌సదాను(42) హతమార్చాడు. హత్య చేయడానికి పాతకక్షలు కూడ కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు.