గుర్తు తెలియని వ్యక్తులు సాయి(30) అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. నల్గొండ జిల్లాకేంద్రలోని రైల్వేస్టేషన్ శ్మశానవాటిక సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బండరాయితో తలపై మోది యువకుని హత్య - నల్గొండలో ఓ వ్యక్తి హత్య
నల్గొండ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ శ్మశానవాటిక సమీపంలో సాయి(30) అనే వ్యక్తిని బండరాయితో మోది దుండగులు హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నల్గొండలో వ్యక్తి హత్య
ఈ రోజు ఉదయం కొందరు దుండగులు అతని తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి :విద్యుదాఘాతంతో యువరైతు మృతి