కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారంలో యామ తిరుపతి అనే వ్యక్తి మంగళవారం ఉదయం బహిర్భూమికి బయటకు వెళ్లగా.. రెండు ఎలుగు బంట్లు ఒకేసారి దాడికి దిగాయి. బాధితుడు తప్పించుకుని పరిగెత్తి ప్రాణాలు రక్షించుకున్నాడు.
వ్యక్తిపై ఒకేసారి రెండు ఎలుగుబంట్ల దాడి.. తీవ్రగాయాలు - bear attack in karimnagar district
రెండు ఎలుగుబంట్లు ఒకేసారి దాడి చేయగా.. ఓ వ్యక్తి గాయపడిన సంఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారంలో చోటుచేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు, బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
గంగాధరలో ఎలుగు బంటి దాడి
రెండు ఎలుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుపతిని బంధువులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటనతో స్థానిక ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి.