మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని మేడ్చల్ జాతీయ రహదారిపై గల భైసాఖీ దాబా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ మజీద్ అనే లారీ క్లీనర్ మృతి చెందాడు. మేడ్చల్ నుంచి నగరానికి వస్తున్న దారిలో దాబా వద్ద లారీ పార్క్ చేసి రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే షేక్ మజీద్ మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ క్లీనర్ మృతి - accident
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ క్లీనర్ మృతి