ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లాకేంద్రంలోని నిజామాబాద్ రహదారిలో స్వప్న డాబా వద్ద ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి
జగిత్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ రహదారిలో ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... మరొకరికి గాయాలు
ఈ ఘటనలో పట్టణానికి చెందిన అంజాద్ అక్కడికక్కడే మృతి చెందగా, రెహ్మాన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.