రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చిట్టెంపల్లి గేట్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమయింది. మృతుడు చిలకమర్రి గ్రామానికి చెందిన అనంతయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు... ఒకరి మృతి - రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చిట్టెంపల్లి గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అదేమార్గంలో హైదరాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు... ఒకరి మృతి
క్షతగాత్రులకు మంత్రి పరామర్శ
రోడ్డు ప్రమాదంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. అదే మార్గంలో కౌకుంట్ల నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా కాన్వాయ్ ఆపి, ఘటనా స్థలంలో క్షతగాత్రులను పరామర్శించారు. చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని ఆటోలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.