మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ కూడలిలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి రహదారి దాటుతూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అదే సమయంలో మరో వైపు నుంచి వచ్చిన ఓ వాహనం అతనిపై తల పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కిందపడిన వ్యక్తి తలపై నుంచి దూసుకెళ్లిన వాహనం - mahabubnagar accident updates
దేవి శరన్నవరాత్రి పూజలో పాల్గొనేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్‌తో రోడ్డు దాటుతుండగా కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న వాహనం అతని తలపైనుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందాడు.
కిందపడిన వ్యక్తి తలపైనుంచి దూసుకెళ్లిన వాహనం
మృతి చెందిన వ్యక్తి మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. మేస్త్రీగా పనిచేసేవాడు. గ్రామంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి పూజలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:'మా జీవితాలన్ని వరదలోనే కొట్టుకుపోాయాయి.. తేరుకోవడం కష్టమే'