యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో రోడ్డుపై ఉన్న భారీకేడును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వేమా హరీష్(22)గా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
భారీకేడును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి మృతి - yadadri bhuvanagiri district news
ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి భారీకేడును ఢీకొట్టి మృతి చెందిన విషాద ఘటన భువనగిరి పట్టణ శివారులో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భారీకేడును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... ఓ వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తుండగా భువనగిరి శివారులోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో భారీకేడును ఢీకొనడం వల్ల తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: హోర్డింగ్‌ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి